KTR London Tour: లండన్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్... మూడో రోజు యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి... రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో తెలంగాణ ముందుందని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. సరళతర వాణిజ్యవిధానంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు. రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధి రంగంలో తెలంగాణ ముందుందని కేటీఆర్ వివరించారు.