తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి మద్దతిస్తాం' - Foxconn company

KTR: భారత పర్యటనలో ఉన్న ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌, ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా గత 8 ఏళ్లలో తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్దికి చేసిన కృషిని కేటీఆర్‌ ఫాక్స్‌కాన్‌ సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియుకి వివరించారు.

'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి మద్దతిస్తాం'
'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి మద్దతిస్తాం'

By

Published : Jun 23, 2022, 9:56 PM IST

KTR: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు అనుగుణంగా చేపట్టిన చర్యలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను స్వయంగా వచ్చి చూసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించారు. గత 8 ఏళ్లలో తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్దికి చేసిన కృషిని ఈ సందర్భంగా కేటీఆర్‌ ఫాక్స్‌కాన్‌ సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియుకి వివరించారు.

భారత పర్యటనలో ఉన్న ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌, ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర అధికారులు దిల్లీలో చర్చలు జరిపారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఫాక్స్‌కాన్‌ ఒకటని.. ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌ తయారీలోనూ ప్రవేశించాలనే వారి నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించిన కేటీఆర్‌.. కంపెనీకి తెలంగాణ నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details