తెలంగాణ

telangana

ETV Bharat / state

గల్లీ స్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ: కేటీఆర్​ - trs campaign in hyderabad

గల్లీ స్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ: కేటీఆర్​
గల్లీ స్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ: కేటీఆర్​

By

Published : Nov 28, 2020, 1:08 PM IST

Updated : Nov 28, 2020, 4:21 PM IST

12:43 November 28

వ్యాపారవేత్తలతో కేటీఆర్ సమావేశం

గల్లీ స్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ: కేటీఆర్​

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఎన్నికలు లేని సమయంలో వచ్చిన కేంద్ర మంత్రులు రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని కొనియాడి.. ఇప్పుడొచ్చి బాగాలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్​ బేగంపేట్​లోని మారిగోల్డ్ హోటల్​లో జరిగిన అగర్వాల్, మహేశ్వరి, మార్వారి, గుజరాతి వ్యాపార ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేస్తారో చెప్పకుండా... విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్​లో అలజడి రేపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రశాంతత దెబ్బతింటే... అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. హైదరాబాద్​లో రోహింగ్యాలు ఉన్నారంటున్న కేంద్రం... ఇన్ని రోజులు నిద్రపోతోందా అని ఎద్దేవా చేశారు.  

ప్రధాని మోదీ ప్రకటించామంటున్న రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఎంతమందికి ఫలాలు చేకూరాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు స్కిల్ ఇండియా, ఫీడ్ ఇండియా అంటూనే... ఎయిర్ ఇండియా, ఎల్ఐసీలను అమ్మేశిన కేంద్రం... ఇప్పుడేమో బేచో ఇండియా అంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో స్థానిక విషయాలు మాట్లాడకుండా... జాతీయ, అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతున్నారన్నారు. 

ఇదీ చూడండి:ప్రగతిశీల, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎన్నుకోవాలి : కేటీఆర్​


 

Last Updated : Nov 28, 2020, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details