Minister KTR Meeting with Auto Unions Leaders : రాష్ట్రంలో నిరుద్యోగం అనేది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉందని.. పదవులు లేక నిరుద్యోగం ఎక్కువైందని ఆ పార్టీ వాళ్లు బాధపడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వస్తే ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి(Chief Minister) మారడం ఖాయమని, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అసాధ్యం అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆటో యూనియన్ సభ్యులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. బీఆర్ఎస్ ప్రగతిని వివరిస్తూనే.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు - రాజకీయాల కోసం బద్నాం చేయొద్దు : కేటీఆర్
ఆటో కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతి ఫలాలను వివరిస్తూనే.. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆటో యూనియన్‌కు సంబంధించి భవనాన్ని హైదరాబాద్‌లో కట్టిస్తామని ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు(Welfare Board) ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు రెండు పడక గదుల ఇల్లు కట్టిస్తామని.. అదేవిధంగా ఆటోడ్రైవర్లకు గృహలక్ష్మి పథకంవర్తింప చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
BRS Election Campaign in Telangana :అభివృద్ధి పథంలో కొత్తపుంతలు తొక్కుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలిచిందన్న మంత్రి కేటీఆర్.. మార్పు కావాలని కొంత మంది నాయకులు ఇక్కడ మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 58 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్నది మార్పు కావాలనే అని చురకలు అంటించారు. 2014లో వచ్చిన మార్పుతోనే తెలంగాణ అభివృద్ధి(Telangana Development) జరిగిందన్నారు. కళ్ల ముందు హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ ఇలా అన్ని పట్టణాలు ఎంతో మార్పు చెందాయన్నారు.