KTR letter to PM Modi on Rozgar Mela: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ రోజ్‌గార్ మేళా పేరుతో యువతను మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు రోజ్‌గార్ మేళాపై ప్రధానికి కేటీఆర్ లేఖ రాశారు. రోజ్‌గార్ మేళా పచ్చి దగా, ఇది యువతను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. నమో అంటే.. నమ్మించి మోసం చేసేవాడని రుజువైందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
నమో అంటే.. నమ్మించి మోసం చేసేవాడని రుజువైంది: కేటీఆర్ - కేంద్రప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
KTR letter to PM Modi on Rozgar Mela: రోజ్‌గార్ మేళా పచ్చి దగా, ఇది యువతను మోసం చేయడమేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రోజ్‌గార్ మేళాపై ప్రధానికి కేటీఆర్ లేఖ రాశారు. నమో అంటే.. నమ్మించి మోసం చేసేవాడని రుజువైందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు యువతను మోసం చేసే ప్రచారాలు మానుకోవాలని కేటీఆర్ సూచించారు.
KTR
భాజపా ఎన్నికల ముందు యువతను మోసం చేసే ప్రచారాలు పక్కన పెట్టాలని పేర్కొన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కేంద్రం నిబద్ధతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చిన మోదీ.. ఈ 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై భాజపా శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంపై యువత తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఇవీ చదవండి: