KTR Letter about CCI : ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని గుర్తుచేశారు. నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు, 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ లేఖలో వెల్లడించారు. 2 కేవీఏ విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఉందన్నారు.
KTR Letter about CCI : 'అన్ని సదుపాయాలున్నాయ్.. ఆదిలాబాద్ సీసీఐని మళ్లీ ప్రారంభించండి'
KTR Letter about CCI : ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ను మళ్లీ ప్రారంభించాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. అందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
KTR Letter to central govt about cci adilabad unit : భౌగోళికంగా ఆదిలాబాద్‌కు ఉన్న సానుకూలతను ఉపయోగించుకుని... మళ్లీ ప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్ సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమ ప్రారంభిస్తే... ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో కంపెనీని తిరిగి ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
ఇదీ చదవండి:Conflict Between TRS AND BJP video : రహదారి ప్రారంభ విషయంలో తెరాస, భాజపా శ్రేణుల గొడవ