ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో నూతనంగా తీసుకొచ్చిన మన్యం మనుగడ మాసపత్రికను హైదరాబాద్‌లో కేటీఆర్ ఆవిష్కరించారు.
మంత్రి కేటీఆర్‌తో ముచ్చటిస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదివాసీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు విద్యాపరంగా ముందడుగు వేసేందుకు ప్రభుత్వ పథకాలు, సామాజికంగా ఆదివాసీలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో మన్యం మనుగడ పత్రికను తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఆదివాసీలు అందరికీ ఈ పత్రిక చేరేలా బాధ్యత తీసుకోవాలని రేగా కాంతారావుకు కేటీఆర్ సూచించారు. ఆదివాసీలు, వెనకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఆరేళ్లుగా ఎంతో కృషి జరిగిందన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃభువనగిరిలో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ