తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో మొదలైన ఉచిత తాగునీటి సరఫరా - జీహెచ్​ఎంసీలో ఉచిత తాగు నీరు

2048 వరకు హైదరాబాద్‌లో తాగునీటి కష్టాల్లేకుండా చర్యలు తీసుకున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఒక్కో కుటుంబానికి 20వేల లీటర్ల ఉచిత నీటిని అందించే పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి దార్శనికతతో రాష్ట్రంలో విద్యుత్‌, తాగునీటి సమస్యను పరిష్కారించామన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమానికి స్వర్ణయుగంలా పాలన అందించామని పేర్కొన్నారు.

ktr
ktr

By

Published : Jan 12, 2021, 9:37 PM IST

జీహెచ్​ఎంసీలో మొదలైన ఉచిత తాగునీటి సరఫరా

జీహెచ్​ఎంసీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ హామీ ఇచ్చిన మేరకు... హైదరాబాద్‌లో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​... రహమత్‌నగర్‌లో ఈ పథకానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

రూ.500కోట్లు భారం

ముఖ్యమంత్రి కేసీఆర్​ దార్శనికతతో... హైదరాబాద్‌లో నీటికోసం ధర్నాలు జరిగే పరిస్థితి నుంచి... ఇప్పుడు ఉచిత నీటినే అందిస్తున్నామని కేటీఆర్​ తెలిపారు. ప్రభుత్వంపై రూ.500 కోట్ల భారం పడినా ఇచ్చిన హామీ మేరకు పేదల కోసం భరిస్తున్నామని వివరించారు. 2048 వరకు హైదరాబాద్‌లో తాగునీటి కొరత లేనివిధంగా ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు.

స్వర్ణయుగం

"కులమతాలకు అతీతంగా పేదలు అభివృద్ధి చెందాలనేదే తెరాస సర్కారు ధ్యేయం. కరోనా సంక్షోభంలో ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదు. కేసీఆర్‌ పాలన సంక్షేమ రంగానికి స్వర్ణయుగం. ఏడేళ్ల తెరాస పాలనలో ఏ ఛార్జీలు పెంచలేదు. ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజల మధ్యే ఉంటూ సేవ చేస్తాం."

-కేటీఆర్‌, పురపాలకశాఖ మంత్రి

తెరాస సర్కార్‌ పాలనలో హైదరాబాద్‌ సమగ్ర అభివృద్ధికి బాటలు వేశామని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ అన్నారు. కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :అనుమతి లేని ప్రాజెక్టుల పనులు ఆపేయండి : కృష్ణాబోర్డు

ABOUT THE AUTHOR

...view details