KTR Launch Telangana Cool Roof Policy: వేసవిలో పెరుగుతున్న ఎండలతో.. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా జనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలోనే చల్లదనం కోసం ఏసీల వాడకం పెరిగుతోంది. తద్వారా కాలుష్య ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు.. వేడిమి వల్ల వడదెబ్బ బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. చలువ పైకప్పులతో భవనాల లోపల.. వేడి తగ్గి, నష్టపోవడంతో పాటు విద్యుత్తు ఆదా అవుతోంది.
ఇందుకోసమే ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా.. నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, ట్రిపుల్ ఐటీ, జీహెచ్‌ఎంసీలతో కలిసి చలువ భవనాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం 2019లో ముసాయిదాను విడుదల చేంది. వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి తుదిరూపు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, ఆస్కి కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని.. దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా చలువ నిర్మాణాలను నిర్వహించి పనితీరును పరిశీలించి.. ప్రభుత్వం కూల్ రూఫ్ పాలసీ తీసుకొచ్చింది.
కూల్ రూఫ్ ఉంటేనే అక్యూపెన్సి సర్టిఫికెట్: దీన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇది ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఇప్పుడున్న ఇళ్లతో పాటు.. కొత్త ఇండ్లకు కూల్ రూఫ్ అమలు చేయాలని నిర్ణయించింది. కూల్‌రూఫ్ టాప్ ముందు.. తన ఇంటికే చేయించినట్లు మంత్రి వెల్లడించారు. రూఫ్‌తో పాటు గోడలకు కూడా పెయింట్ వేస్తే.. ఇంకా చల్లగా ఉంటుందని అన్నారు. దీనిని తప్పనిసరి చేస్తున్నామని.. కూల్‌రూఫ్ ఉంటేనే అక్యూపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.