కాంగ్రెస్ సవాల్‌ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను! - TRS Working president latest news
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తాను దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికే తన ప్రచారం పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికలు తన పనితీరుకు ప్రామాణికంగా పరిగణిస్తున్నానని... సింహభాగం స్థానాలను తెరాసనే కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త మున్సిపాల్టీ చట్టం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతోందంటున్నారు. పురపోరుతోపాటు రాష్ట్ర, జాతీయ రాజకీయ అంశాలపై మంత్రి కేటీఆర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.
minister
.
Last Updated : Jan 15, 2020, 11:10 AM IST