తెలంగాణ

telangana

ETV Bharat / state

అది రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్ - సవాల్​ విసిరిన మంత్రి కేటీఆర్

Minister KTR visited Hujurnagar: బీఆర్ఎస్ సర్కార్‌ తీసుకున్న రుణాలతో తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పథకాలపై పెట్టుబడి పెట్టిందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఏ ప్రధాని హయాంలో చేయని విధంగా అప్పులు చేసిన మోదీ చేసిన ఒక్క మంచి పనైనా చెప్పగలరా? అని సవాల్‌ విసిరారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇది తప్పని రుజువుచేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

Minister KTR visited Hujurnagar
Minister KTR visited Hujurnagar

By

Published : Jan 6, 2023, 3:52 PM IST

Updated : Jan 6, 2023, 7:26 PM IST

అది రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్

Minister KTR visited Hujurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, హుజూర్‌నగర్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.

కేంద్రం నిధులను పక్కదారి పట్టించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఇది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్ విసిరారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన అప్పులతో భవిష్యత్‌ తరాల కోసం పెట్టుబడులు పెడుతోందని మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు.

బీజేపీ సర్కార్‌ చేసిన 100లక్షల కోట్ల అప్పుతో చేసిన ఒక్క మంచి పని, బాగుపడ్డ ఒక్క వర్గం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని దేశ దిక్సూచిగా పెట్టేందుకు కేసీఆర్‌ బీఆర్ఎస్ పెట్టారు తప్ప.. జెండా, అజెండా మారలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పేరుమారింది తప్ప పనితీరు మారలేదని ఉద్ఘాటించారు. అనంతరం మునుగోడు నియోజకవర్గం చండూర్‌లో 40కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.

చండూర్‌లో 40కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం

ఉపఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా, అన్ని హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. రెండునెలల్లో రెండుసార్లు వచ్చానని ఎన్నికల ముందు ఒకవిధంగా ఆ తరువాత మరో విధంగా వ్యవహరించే పార్టీ బీఆర్ఎస్ కాదని, ఎప్పుడైనా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కేంద్రం ఎదో పైసలిచ్చిందంటా, మనమేదో పక్కదారి మళ్లించినమంటా. నేను సూటిగా అడుగుతున్నా ఈరోజు మాట్లాడే భారతీయ జనాతా పార్టీ నాయకులను, కేంద్రంలో ఉండే మంత్రులను కేంద్రంలో ఉండే ఇతర ఎంపీలను ఇతర నాయకులను ఎవరి సోమ్ముతో ఎవరు కులుకుతా ఉన్నారు. తెలంగాణ సోమ్ముతో, తెలంగాణ ఎనిమిదేళ్లలో కట్టిన 3లక్షల 68వేల కోట్లతో వెనుక పడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఈ పైసలు అక్కడ వాడటం వాస్తవం కాదా. -కేటీఆర్, మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Jan 6, 2023, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details