సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు సూచించే ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం ప్రథమ వినియోగదారుడిలా ఉంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు.
సమస్యను పరిష్కరించే ఆవిష్కరణలకే విలువ: కేటీఆర్ - నెక్లెస్‌రోడ్‌లో సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన-2020
టెక్నాలజీ లక్ష్యం మానవ అవసరాలు తీర్చటమే కాక, సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు కనుకొన్నప్పుడే దానికి విలువ ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దివ్యాంగులు అందరికీ ఉపయోగపడేలా సహాయ ఉపకరణాలను తీసుకురావాలని వారికి సూచించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.
ktr
ప్రదర్శనలోని స్టాళ్లన్ని కలియతిరిగి ఉపకరణాలను ఆసక్తిగా తిలకించారు. ఆవిష్కర్తలను ఇన్నోవేషన్స్ గురించి అడిగి తెలుసుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌లోనే అతి పెద్ద ప్రోటోటైప్ ల్యాబ్ టి వర్క్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. దివ్యాంగులు అందరికీ ఉపయోగపడేలా సహాయ ఉపకరణాలను తీసుకురావాలని వారికి సూచించారు.
ఇదీ చదవండి :గ్రేటర్‌లో తెరాసకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
Last Updated : Dec 3, 2020, 10:13 PM IST