KTR inaugurated Bansilalpet step well: హైదరాబాద్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తెస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భూగర్భజలాలు రీఛార్జ్ అయ్యే విధంగా బన్సీలాల్‌పేట్ మెట్లబావి రూపకల్పన జరిగిందన్నారు. చరిత్ర, వారసత్వ చిహ్నాల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రూ.10 కోట్లతో మెట్లబావి సుందరీకరణ పనులు జరిగాయని పేర్కొన్నారు. కళలు, కళాకారులు, సంస్కృతికి చిహ్నంగా మెట్లబావి మారాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
'బన్సీలాల్‌పేట్ మెట్లబావిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా ఆధునీకరణ. మ్యూజియం, యాంఫీ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నాం. కులీ కుతుబ్‌షా టూంబ్స్ వద్ద 6 మెట్ల బావుల ఆధునీకరణ. మెట్లబావులు పునరుద్ధరించిన ఆగాఖాన్ ఫౌండేషన్‌కు యునెస్కో అవార్డు. చరిత్ర, వారసత్వ చిహ్నాల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తెస్తాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
బన్సీలాల్ మెట్ల బావి... అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికులు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు. భాగ్యనగర చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాలను... రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రత్యేక చొరవతో పునరుద్ధరిస్తున్నాయి. బన్సీలాల్‌పేట్‌లో 3 శతాబ్దాల కిందట నిర్మించిన నాగన్నకుంట మెట్లబావికి కొత్త అందాలను అద్దారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో అప్పట్లో ఈ కట్టడాన్ని నిర్మించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన మెట్లబావిని పునరుద్ధరించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ఈ బావిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టున్నాయి.