తెలంగాణ భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం ఆవరణలోని తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు తెరాస నేతలు పూల మాలలేసి జోహార్లు అర్పించారు.
తెలంగాణ భవన్‌లో జెండాను ఎగురవేసిన మంత్రి కేటీఆర్ - తెలంగాణ భవన్‌లో జెండాను ఎగురవేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో జెండాను ఎగురవేసిన మంత్రి కేటీఆర్
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :డబ్బుల వ్యవహారంపై కార్పొరేటర్ ఆడియో సంభాషణ కలకలం