తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Help To Sabitha: సబితకు మంత్రి కేటీఆర్ సాయం - ktr help to inte r student sabitha

KTR Help To Sabitha: కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్​గా మారిన ఇంటర్ విద్యార్థిని సబితకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ట్విటర్​ వేదికగా ఆమె గురించి తెలుసుకున్న కేటీఆర్... బుధవారం తన కార్యాలయానికి పిలిపించుకుని సాయం అందజేశారు.

KTR
KTR

By

Published : Feb 9, 2022, 7:08 PM IST

KTR Help To Sabitha: నల్గొండ ఇంటర్‌ విద్యార్థిని సబితకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సాయం అందించారు. ఇంటర్ చదువుతూ కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్న సబిత గురించి మంత్రి కేటీఆర్ ఇటీవల తెలుసుకున్నారు. బుధవారం సబితను ప్రగతిభవన్ పిలిపించుకుని కేటీఆర్ సాయమందించారు. భవిష్యత్‌లోనూ సబితకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. రెండు పడక గదుల ఇల్లు, ఆటో రిక్షా మంజూరు పత్రాలు అందించారు. మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో మరిన్ని లక్ష్యాలు చేరుకుంటానని సబిత తెలిపారు.

సబితకు మంత్రి కేటీఆర్ సాయం

ABOUT THE AUTHOR

...view details