తమిళనాడు రాష్ట్రానికి తాగు నీరివ్వడానికి సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించడాన్ని గవర్నర్ తమిళి సై స్వాగతించారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పరస్పర సహకార ధోరణి అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర సహకారానికి ఇదొక నమూనాగా నిలుస్తుందని తమిళిసై కొనియాడారు.
'తమిళనాడుకు తాగు నీరిస్తాననడం ఓ స్ఫూర్తిదాయక నిర్ణయం' - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు
తమిళనాడు తాగునీటి సమస్య పరిష్కారానికి సహకరిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ పట్ల గవర్నర్ తమిళిసై, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇదొక స్ఫూర్తిదాయక నిర్ణయమని కొనియాడారు.

తమిళనాడుకు తాగు నీరిస్తాననడం ఓ స్ఫూర్తిదాయక నిర్ణయం
మరోవైపు తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్వాగతించారు. ఇదొక స్ఫూర్తిదాయక నిర్ణయమని కొనియాడారు. రాష్ట్రాల మధ్య సహకార ధోరణికి ఇది నిదర్శనమని తెలిపారు.