తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2020 సంవత్సరంలో తన సేవలతో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను.. బెస్ట్ ఫర్ ఫార్మింగ్ ఐటీ మినిష్టర్‌గా కేటీఆర్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు ప్రకటించింది. అలాగే పలు ఇన్నోవేటిక్, ఈ గవర్నెన్స్ ఇన్షియేటివ్లతో ప్రత్యేకత చాటిన తెలంగాణ రాష్ట్రాన్ని 'స్టేట్ ఆఫ్ ది ఇయర్'కు ఎంపిక చేసింది.
రాష్ట్రానికి మరోసారి స్కోచ్ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్ - KTR nominated for Scotch Best Minister Award
తెలంగాణకు మరోసారి స్కోచ్ అవార్డులు లభించాయి. స్కోచ్ ఇ-గవర్నెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. 2020కి గాను స్కోచ్ ఉత్తమ మంత్రి అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు.
రాష్ట్రానికి మరోసారి స్కోచ్ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్
ఈ మేరకు ఇందుకు సంబంధించిన అవార్డును మంత్రి కేటీఆర్‌కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అందజేస్తూ.. రాష్ట్రానికి ఈ రెండు అవార్డులు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తెలంగాణ పోలీసులకు స్కోచ్ బంగారు పతకం