తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి ఎమ్మెల్యే అక్కడే ఉండాలి... సహాయక చర్యలు పర్యవేక్షించాలి' - మంత్రి కేటీఆర్ సూచనలు

నగరంలో ప్రజా ప్రతినిధులంతా రానున్న పది రోజులు... క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించాలన్నారు.

minister ktr giving suggestions to mlas on floods in hyderabad
'ప్రతి ఎమ్మెల్యే అక్కడే ఉండాలి... సహాయక చర్యలు పర్యవేక్షించాలి'

By

Published : Oct 20, 2020, 7:59 PM IST

హైదరాబాద్​లో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణ కోసం... జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు మేయర్, డిప్యూటీ మేయర్​తో సమావేశాన్ని నిర్వహించారు. రానున్న పది రోజులు... ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ... సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని కోరారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ తక్షణ సాయం అందాలన్న కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి... అక్కడ అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. దుప్పట్లు, మందులు, భోజనాలు అందేలా చూడాలని సూచించారు. ముంపునకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి... భరోసా కల్పించాలి సూచించారు.

ఇదీ చూడండి:అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details