ప్రముఖ గేయ రచయిత కందికొండ (Kandikonda) చికిత్స కోసం మంత్రి కేటీఆర్ (Minister ktr) చేయూత ఇచ్చారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రూ. 2 లక్షల 50 వేల సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
Kandikonda: కందికొండ చికిత్స కోసం మంత్రి కేటీఆర్ చేయూత - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు
గేయ రచయిత కందికొండ (Kandikonda) చికిత్స కోసం మంత్రి కేటీఆర్ (Minister ktr) చేయూత ఇచ్చారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు.

ktr
హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి... కందికొండ(Kandikonda)కు మరింత మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయన్నారు. కందికొండ (Kandikonda) సాహిత్య సేవ మరింత కాలం కొనసాగేలా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని మంత్రి కేటీఆర్ అభిలషించారు.