KTR On Modi : రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై స్పందిస్తూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. హిజాబ్ అంశం తీవ్ర నిరాశ, ఆందోళన కలిగించిందన్నారు. అయితే హిజాబ్ వివాదం వెనక అసలు వ్యూహమేంటో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయంటే.. ఎన్నికలు జరుగుతున్నాయనేది దేశంలో అందరూ అనుకునేదేనని కేటీఆర్ పేర్కొన్నారు.