minister ktr fires on central govt : గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని వ్యాఖ్యానించారు. మోనార్క్ మోదీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్‌లు తలకిందులయ్యాయని విమర్శించారు. భాజపా ప్రభుత్వం ధరలు పెంచి దేశ ప్రజలపై దొంగదాడి చేస్తోందని ఆరోపించారు.
మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు: కేటీఆర్ - minister ktr comments
minister ktr fires on central govt : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై తీవ్రంగా మండిపడ్డారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన తెరాస కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలపై నిరంతర పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Jul 7, 2022, 4:34 PM IST