తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2021, 12:07 PM IST

ETV Bharat / state

ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం: కేటీఆర్

రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో చెప్పినా... పైసా కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్నేకేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని మండిపడ్డారు.

minister-ktr-fire-on-central-government-due-to-funds-in-hyderabad
ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం: కేటీఆర్

విభజన చట్టం మేరకు పరిశ్రమలకు రావాల్సిన రాయితీల్లో నయా పైసా కూడా కేంద్రం నుంచి రాలేదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో రూపొందించిన చట్టాన్నే కేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని మండిపడ్డారు. టీఎస్-ఐపాస్‌ ద్వారా రూ.2లక్షల 13వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు.

ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం: కేటీఆర్

పారిశ్రామిక వికేంద్రకరణలో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలతో పాటు జిల్లాల్లోనూ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలకు టీఎస్‌-ఐపాస్‌తో సంబంధం లేకుండా అదనపు రాయితీలు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:కూడవెళ్లి వాగుకు గోదావరి నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details