Minister KTR Dubai Tour 2023: మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనలో తొలిరోజే (మంగళవారం) రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. అగ్నిమాపక పరికరాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో తెలంగాణలో రూ. 700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.. మంత్రి కేటీఆర్(KTR at Dubai 2023)తో భేటీ అయ్యారు. 'నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్'తో కలిసి అంతర్జాతీయ స్థాయి 'ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ'ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ చేసిన ప్రతిపాదనకు సైతం ఆయన అంగీకరించారు. దాదాపు 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Minister KTR America Tour 2023 : తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడితో తమ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ 'డీపీ వరల్డ్' తెలిపింది. డీపీ వరల్డ్ గ్రూప్(DP World Group) కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అనిల్ మెహతా, సంస్థ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి తదితరులు మంగళవారం మంత్రి కేటీఆర్‌తో దుబాయ్‌లో భేటీ అయ్యారు. పోర్ట్ ఆపరేటర్‌గా ప్రపంచంలోనే అగ్ర భాగాన ఉన్న డీపీ వరల్డ్ హైదరాబాద్‌లో తమ 'ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్' కోసం రూ.165 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ ప్రాంతంలో రూ.50 కోట్లతో 5000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్‌హౌస్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Corning Material Sciences Investments in Telangana : తెలంగాణలో మరో అగ్రగామి సంస్థ పెట్టుబడులు
Dubai Companies Investments in Telangana : తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు లులూ గ్రూప్(LuLu Group Hyderabad) ఛైర్మన్ యూసుఫ్ అలీ ప్రకటించారు. కేటీఆర్‌తో ఆయన దుబాయ్‌లో సమావేశమయ్యారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో తమ సంస్థ కొనసాగిస్తున్న కార్యకలాపాలను మంత్రికి యూసుఫ్ అలీ వివరించారు. తమ సానుకూల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. కార్యకలాపాలను విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాలో రానున్న ఆక్వా క్లస్టర్‌లో పెట్టుబడులు పెడతామన్నారు. అక్కడి నుంచి ఏటా రూ.1000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులను సేకరిస్తామన్నారు. ఇందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీ, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లను నెలకొల్పుతామన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని యూసఫ్ వివరించారు.