తెలంగాణ

telangana

ETV Bharat / state

MINISTER KTR: దివ్యాంగులకు చేయూతనిద్దాం.. అండగా నిలుద్దాం - తెలంగాణ రాజకీయాలు

హైదరాబాద్ జలవిహార్​లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేశారు. తన మీద అభిమానంతో దివ్యాంగులకు వాహనాలు అందజేసేందుకు ముందుకొచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు.

minister-ktr-distributed-scooters-to-physically-handicaped-people-in-hyderabad
minister-ktr-distributed-scooters-to-physically-handicaped-people-in-hyderabad

By

Published : Aug 8, 2021, 2:17 PM IST

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు మంత్రి కేటీఆర్ వాహనాలు పంపిణీ చేశారు. పీవీ మార్గ్​లోని జలవిహార్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సహా ఎర్రబెల్లి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లకు డబ్బు వృద్ధా చేయొద్దని పేర్కొన్న కేటీఆర్.. గత ఏడాది నుంచి "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. అందులో భాగంగానే గతేడాది సిరిసిల్లలో ఆరు ఆంబులెన్స్​లు పంపిణీ చేశారు. ఇక ఈ ఏడాది దివ్యాంగుల కోసం 130 స్కూటర్లను గిఫ్ట్ ఏ స్మైల్​ కార్యక్రమంలో భాగంగా అందించారు.

రాజకీయాల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. బ్యానర్లు, హోర్డింగుల కోసం చాలా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. అవన్నీ తగ్గించుకుని, ఆ డబ్బులను అవసరాలకు ఉపయోగించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. కరోనా విపత్కర పరిస్థితుల్లో వృథా ఖర్చులు పెట్టొద్దు. అందకే గతేడాది నా పుట్టినరోజు సందర్భంగా 100 అంబులెన్స్​లు పంపిణీ చేశా. దాన్ని మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు స్ఫూర్తిగా తీసుకున్నారు. వారుసైతం అంబులెన్స్​లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు వంటివి పంచారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ముందుకెళతాం. -కె.తారక రామారావు, మంత్రి

దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 150 , ఎమ్మెల్యే కృష్ణారావు 100 , ఎమ్మెల్సీ నవీన్ 100, ఎమ్మెల్సీ షమీపూర్ రాజు 63, ఎమ్మెల్యే వివేకానంద్ 50 చొప్పున స్కూటర్లు అందించేందుకు ముందుకు వచ్చినట్టు ప్రకటించారు. రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక రోజుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం లక్షలు ఖర్చు చేస్తామని... అందుకు బదులుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ కోరారు.

గతేడాది కూడా తన పుట్టిన రోజు సందర్భంగా తన నియోజకవర్గమైన సిరిసిల్లలో 6 అంబులెన్స్​లు ఇస్తున్నట్లు ప్రకటించినట్లు పేర్కొన్నారు. స్పందించిన మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో 100 అంబులెన్స్​లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అలాగే ఇప్పుడు కూడా గిఫ్ట్​ ఏ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటి వరకు స్పందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రైతులకు శుభవార్త.. సోమవారమే ఖాతాల్లోకి డబ్బులు

ABOUT THE AUTHOR

...view details