KTR Fires on Central Government :రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై దిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం అనంతరం.. విలేకరులతో ముచ్చటించారు. దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసినా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న ప్రశ్నపై స్పందించారు. దేశ రాజకీయాలు దిల్లీ కేంద్రంగానే సాగాలని అనుకోవద్దని.. తాము హైదరాబాద్ నుంచే చక్రం తిప్పుతామని తెలిపారు. ఇప్పటివరకు పని చేసిన ప్రధానమంత్రులందరిలో అత్యంత బలహీనుడు నరేంద్ర మోదీనేనని.. ఆయనకు అవకాశం ఇస్తే దిల్లీని కూడా గుజరాత్‌కు తరలిస్తారని వాఖ్యానించారు.
మోదీని దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది బీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టంచేశారు. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై.. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని.. కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్నాలో విపక్షాల సమావేశంపై ప్రశ్నించగా.. ‘విపక్ష పార్టీలను ఏకం చేసే రాజకీయాలు కాదు.. ప్రజలను ఏకం చేసే రాజకీయాలను తాము నమ్ముతామని చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీలే కలిసి పనిచేస్తాయన్నారు. నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల్లో హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు.
KTR fires on Congress and BJP : మేఘాలయలో గతంలో కాన్రాడ్ సంగ్మాకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయనికేటీఆర్ వివరించారు. ఎన్టీఆర్ హయాం నుంచి విపక్ష కూటములు ఏర్పాటు చేస్తున్నారని.. ఒకరిని దింపడానికి మరొకరితో చేతులు కలుపుతున్నారన్నారు. బీఆర్ఎస్ అలా చేయదని.. ఒకరిని దింపడానికి మరొకరిని సమర్థించాలా? ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరాలేని గ్రామాలు ఉన్నాయంటే అందుకు బాధ్యత ఇన్నేళ్లు పరిపాలించిన హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీలదేనని కేటీఆర్ దుయ్యబట్టారు.