Minister KTR Tweet Today: ఇప్పుడున్న రాజకీయ నేతలంతా ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏదైనా సంఘటన జరిగితే చాలు వాటిని వెంటనే పోస్ట్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అయితే ట్విటర్లో యమా యాక్టివ్. కేంద్రంపై విమర్శలు, ప్రజా సమస్యలతో పాటు రాష్ట్రాభివృద్ధి, ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ట్విటర్‌ను వేదిక చేసుకుంటారు.
సామాన్యుడికి రోజు రోజుకు బతుకు భారంగా మారుతోంది: తాజాగా 'మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా సామాన్యుడికి రోజు రోజుకు బతుకు భారంగా మారుతోందని మంత్రి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ట్విటర్‌లో ఒక యూజర్ పోస్ట్ చేసిన వీడియోను కోట్ చేస్తూ.. కేటీఆర్ రిపోస్ట్ చేశారు. ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు, నియంత్రించేది లేదని ధ్వజమెత్తారు.
KTR Tweet About Kanti Velugu: ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలని లేదు, గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఆగ మేఘాల మీద అదానీ కంపెనీని.. ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం.. దేశం కోసం కాదు.. దోస్తు కోసం అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం మేక్ ఇన్ తెలంగాణ అన్న నినాదానికి నిజమైన ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు.