అవసరమే ఆవిష్కరణకు బీజమని.. దీన్ని హైదరాబాద్కు చెందిన టీవర్క్స్ నిరూపించిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కొవిడ్- 19 పాజిటివ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఎయిరోసాల్ పెట్టెలను తయారు చేసిన టీవర్క్స్ కృషిని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రోటో టైప్ సెంటర్ టీవర్క్స్.. నిమ్స్, శరత్ చంద్ర బటర్ ఫ్లై ఎడ్యూఫీల్డ్స్ సహకారంతో ఈ ఎయిరోసాల్ పెట్టెలను తయారు చేసింది. సామాజిక దూరం పాటిస్తూ.. కరోనా సోకిన బాధితునికి చికిత్స అందించే సౌలభ్యం ఉన్న ఈ ఎయిరో సాల్ పెట్టెలను గాంధీ, నిమ్స్ ఆసుపత్రికి టీవర్క్స్ అందజేసింది.
అవసరమే ఆవిష్కరణకు బీజం.. - ktr congratulates tworks
కరోనా పాజిటివ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఎయిరోసాల్ పెట్టెలను తయారు చేసిన టీవర్క్స్ కృషిని పురపాలక మంత్రి కేటీఆర్ అభినందించారు.

అవసరమే ఆవిష్కరణకు బీజం..