పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు జాతీయ స్థాయిలో హడ్కోకు బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు దక్కినందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో పురపాలక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, గృహనిర్మాణ విభాగం ఓఎస్డీ సురేష్‌కుమార్ మంత్రిని కలిసి అవార్డుపై మంత్రికి వివరించారు.
హడ్కో అవార్డు రావడంపై కేటీఆర్ అభినందన - హైదరాబాద్ సమాచారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు జాతీయ స్థాయిలో అవార్డు రావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను అభినందించారు. హడ్కోకు బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

హడ్కో అవార్డు రావడంపై కేటీఆర్ అభినందన
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి 8598 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మంత్రికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తున్నందుకు కేటీఆర్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.