తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Tweet on PlugAndPlay: ప్లగ్‌ అండ్‌ ప్లే సంస్థ ప్రతినిధులకు కేటీఆర్‌ అభినందనలు... - కేటీఆర్‌ తాజా ట్వీట్

KTR Tweet on PlugAndPlay: అమెరికాకు చెందిన ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్‌ తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించడం పట్ల మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. తమ భాగస్వామ్యంలో మరిన్ని గొప్ప ఆవిష్కరణలుంటాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన కొత్త కేంద్రం ఫోటోలను ట్విటర్‌కు జత చేశారు.

KTR Tweet on PlugAndPlay
KTR Tweet on PlugAndPlay

By

Published : Dec 14, 2021, 9:47 AM IST

KTR Tweet on PlugAndPlay: అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆవిష్కరణల వేదికైన ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్‌... తమ తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. అక్టోబరు 29న ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా కేంద్రం ఏర్పాటును ప్రకటించిన ప్లగ్‌ అండ్‌ ప్లే... రెండు నెలల్లోగా ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ భాగస్వామ్యంలో మరిన్ని గొప్ప ఆవిష్కరణలుంటాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లగ్‌ అండ్‌ ప్లే వ్యవస్థాపక ముఖ్యకార్యనిర్వహణాధికారి సయూద్‌ అమీదితో సమావేశం సహా హైదరాబాద్‌లో ప్రారంభించిన కొత్త కేంద్రం ఫోటోలను ట్విటర్‌కు జత చేశారు.

జీవశాస్త్రాలు, ఆర్థిక సాంకేతికత, ఆరోగ్య పరిరక్షణ, ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు, విద్యుత్‌, మౌలిక వసతులు, గతిశక్తి రంగాల్లో నూతన ఆవిష్కరణలు, అంకురాలకు ప్రోత్సాహం, ఆకర్షణీయ నగరాల అభివృద్ధిలో పాలు పంచుకునే ప్లగ్‌ అండ్‌ ప్లే సంస్థ నెట్‌ వర్క్‌లో ప్లేబుక్‌తో పాటు 530కి పైగా ప్రపంచ ప్రముఖ సంస్థలు, 35వేల అంకురాలున్నాయి.

ఇదీ చదవండి:Cyber Crimes: వాట్సాప్ గ్రూపులతో జాగ్రత్త.. భారీ లాభాల ఎరతో రూ.లక్షల్లో టోకరా

ABOUT THE AUTHOR

...view details