'ఆదివారం ఉత్సాహం కలిగించిన వీడియో' అంటూ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా పంచుకున్న వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇసుక తిన్నెల్లో ఓ బాలుడు ఆ వీడియోలో అద్భుతమైన ఫీట్లు చేస్తుండటం విశేషం. ఈ వీడియోని కోట్ చేసిన కేటీఆర్.. 'భవిష్యత్తులో ఒలింపిక్ మెడలిస్ట్' అంటూ కితాబిచ్చారు. ఆ బాలుడు ఏ ప్రాంతానికి చెందినవాడో వివరాలు ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా కోరారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా లేక ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా తగిన సహాయం అందించాలనుకుంటున్నట్లు ప్రకటించారు.
బుడ్డోడి ఫీట్లకు కేటీఆర్ ఫిదా.. ట్విట్టర్లో అభినందనలు - సాహసవీరులకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అభినందనలు
ఇసుక తిన్నెల్లో ఓ బాలుడు ఔరా అనిపించేలా ఫీట్లు చేస్తున్నాడు. ఆ వీడియో ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. ఆ బాలుడి అద్భుత ఫీట్లకు మనమే కాదు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. ఫ్యూచర్ ఒలింపిక్ మెడలిస్ట్ అంటూ కితాబిచ్చారు. అలాగే కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన తరుణ్జోషీకి అభినందనలు తెలిపారు.
మంత్రి కేటీఆర్, సాహసవీరులు, ట్విట్టర్లో కేటీఆర్ ప్రశంసలు
ఇక కేటీఆర్ చేసిన మరో ట్వీట్లో.. ఇటీవల దిగ్విజయంగా కిలీమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐపీఎస్ అధికారి తరుణ్జోషీని అభినందించారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం.. కిలిమాంజారోను ఈ నెల 21న హైదరాబాద్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ సంయుక్త సీపీ తరుణ్ జోషీ దిగ్విజయంగా అధిరోహించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది!