తెలంగాణ

telangana

ETV Bharat / state

గుజరాత్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు: కేటీఆర్‌

KTR comments on welspun group investments ఐదేళ్ల క్రితం చందనవెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని.. ఇప్పుడు చందనవెల్లికి చాలా పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయని మంత్రి కేటీఆర్‌ సంతోశం వ్యక్తం చేశారు. అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా చందనవెల్లి మారుతోందని స్పష్టం చేసిన మంత్రి... గుజరాత్ నుంచి వచ్చి వెల్‌స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ఈ సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెట్టుబడికి సిద్ధమైందని వివరించారు.

ktr
ktr

By

Published : Feb 22, 2023, 3:17 PM IST

గుజరాత్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు: కేటీఆర్‌

KTR comments on welspun group investments కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి... మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లి పారిశ్రామిక వాడలో వెల్ స్పన్ అడ్వాన్స్ డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, వెల్ స్పన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో పూర్తి చేసిందన్న కేటీఆర్... దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని కేటీఆర్ అన్నారు. ఐదేళ్ల కింద చందన్ వెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని... ఇపుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయని చెప్పారు. భవిష్యత్‌లో తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా ఈ ప్రాంతం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్ నుంచి వచ్చి వెల్‌స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టిందన్న మంత్రి... రాబోయే ఐదేళ్లలో చందన్ వెల్లిలో 3000 నుంచి 5000 కోట్ల పెట్టుబడి పెడతామన్న సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకాకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మహిళలను భాగస్వామ్యుల్ని చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమని అన్నారు. చందన్ వెల్లిలో తయారయ్యే సగం ఉత్పత్తులు సిలికాన్ వ్యాలీకే వెళ్తాయన్న వెల్ స్పన్ గ్రూప్ ఛైర్మన్ బాలకృష్ణ గోయెంకా... రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టి చందన్ వెల్లిని వెల్ స్పన్ వ్యాలీగా మారుస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్ విజన్.. చందన్ వెల్లి టు సిలికాన్ వ్యాలీ అన్న ఆయన... సీఎం కేసీఆర్ అద్భుత దార్శనికతతో ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.

''ఐదేళ్ల క్రితం చందనవెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఇప్పుడు చందనవెల్లికి చాలా పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయి. అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా చందనవెల్లి మారుతోంది. గుజరాత్ నుంచి వచ్చి వెల్‌స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టింది. వెల్‌స్పన్‌ సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెట్టుబడికి సిద్ధమైంది. వెల్‌స్పన్‌ స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటోంది. వెల్‌స్పన్‌ కంపెనీ బాలకృష్ణ గోయెంకాకు కృతజ్ఞతలు.'' - మంత్రి కేటీఆర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details