తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister KTR Comments on Balka Suman : బాల్క సుమన్​ మంత్రి అయితే ఎన్నో అద్భుతాలు చేస్తారు: కేటీఆర్ - కాంగ్రెస్​ పార్టీ ఆరుగ్యారంటీలపై కేటీఆర్​ విమర్శలు

Minister KTR Comments on Balka Suman : 60 ఏళ్లల్లో ఏమీ చేయని కాంగ్రెస్​.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ వస్తోందని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన రోడ్డు షో, సభలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.250 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Minister KTR
Minister KTR Fires on Congress Party

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 2:17 PM IST

Minister KTR Comments on Balka Suman : 150 ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్​ పార్టీ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని బీఆర్​ఎస్​ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR)​ ధ్వజమెత్తారు. 60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్​.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees) అంటూ వస్తోందని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన రోడ్డు షో, సభలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. అనంతరం రూ.250 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్​ను పొగడ్తలతో ముంచెత్తారు.

KTR Fires on Congress Party: 60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్​.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ ఎన్నికలకు వస్తోందని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వు పెట్టే పార్టీని నమ్మవద్దంటూ ప్రజలకు హితవు పలికారు. 150 ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్​ పార్టీ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్​ గెలిస్తే ఐదేళ్లకు ఐదుగురు సీఎంలు అవుతారని.. సీఎంలు ఎవరు ఉండాలో కూడా దిల్లీ నుంచే కవర్​ వస్తుందని విరుచుకుపడ్డారు.

KTR Interesting Comments on PM Narendra Modi : 'మోదీపై పరోక్ష వ్యాఖ్యలు.. చాయ్‌ అమ్ముకునే వారు దేశాన్ని మోసం చేయొద్దు'

Minister KTR visit to Mancherial :మరోవైపు ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్​ కీలక పాత్ర పోషించారని మంత్రి కేటీఆర్​ మెచ్చుకున్నారు. ఎన్నికల్లోనూ బాహుబలిని ఎదుర్కొని.. విజయం సాధించారని తెలిపారు. మంత్రులుగా ఉన్న వాళ్లు చేయని పనులను బాల్క సుమన్​ చేసి చూపించారన్నారు. భవిష్యత్తులో సుమన్​కు మంత్రి అయితే ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారని పేర్కొన్నారు.

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన :అంతకుముందు శంకర్​పల్లిలోని ఆయిల్​పామ్​ ప్లాంటుకు కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ మహిళా భవనాన్ని రెండు కోట్ల వ్యయంతో ప్రారంభించారు. మంత్రి రాకతో ఆదర్శ పాఠశాల విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆయనకు అభివాదం తెలిపారు. విద్యార్థుల వద్దకు వెళ్లి మంత్రి వారి యోగక్షేమాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. మరి కొంతమందితో సెల్ఫీలు దిగి ఆనందపరిచారు.

సింగరేణి కార్మిక వాడల్లో పర్యటిస్తూ, మిషన్ భగీరథ ప్లాంటును ప్రారంభించారు. అనంతరం మందమర్రి మార్కెట్ సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. అనంతరం రూ.250 కోట్ల వ్యయంతో మందమర్రి, క్యాతన్​పల్లి మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్​తో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేశారు. ఈసారి ఎలాగైనా కేసీఆర్​ను ముచ్చటగా మూడోసారి సీఎంగా గెలిపించి.. మందమర్రి జిల్లా అభివృద్ధికి సహకరిద్దామని ప్రజలకు సూచించారు.

KTR Speech in Wanaparthy Ten Years Progress : 'తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష?'

KTR Playing Football Video Viral : పుట్​బాల్​ ఆడుతూ గోల్​ కొట్టిన కేటీఆర్​.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details