తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్విటర్ ఖాతాను టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మార్చుకున్న కేటీఆర్

KTR Changed Twitter Account Name: పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ హ్యాండిల్‌లో మార్పులు చేశారు. 'కేటీఆర్‌ టీఆర్‌ఎస్' నుంచి 'కేటీఆర్‌ బీఆర్‌ఎస్'గా తన ఖాతాను మార్చుకున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న హోదాను ప్రొఫైల్ నుంచి తొలగించారు. మంత్రి, ఎమ్మెల్యే అని ప్రొఫైల్‌ మార్చారు.

Ktr
Ktr

By

Published : Jan 25, 2023, 3:29 PM IST

KTR Changed Twitter Account Name: టీఆర్‌ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ హ్యాండిల్‌లోనూ మార్పులు చేశారు. 'కేటీఆర్‌ టీఆర్‌ఎస్' నుంచి 'కేటీఆర్‌ బీఆర్‌ఎస్' గా మార్చారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న హోదాను కూడా ప్రొఫైల్ నుంచి మంత్రి కేటీఆర్ తొలగించారు.

పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు హోదా మాత్రమే మంత్రి కేటీఆర్ ట్విటర్ ప్రొఫైల్‌లో పెట్టుకున్నారు. ట్విటర్ హ్యాండిల్ మారినందున వెరిఫై టిక్‌ను తొలగించారు. హ్యాండిల్ మారినందున వెరిఫై టిక్ తొలగిస్తారని... అన్ని పరిశీలించాక మళ్లీ వెరిఫై టిక్ ఇస్తారని సమాచారం.

ఇదిలా ఉంటే వారం క్రితం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా.. ప్రభావితం చేసే జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 30 మంది జాబితాలో కేటీఆర్​కు స్థానం దక్కింది. భారతదేశం నుంచి ఇద్దరు యువనేతలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అందులో కేటీఆర్ 12వ స్థానం కాగా మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. 22వ స్థానంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నాయి.

రెండు ఖాతాల్లోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానం: ఇద్దరిలోనూ మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా.. తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్.. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అటు అధికారిక, ఇటు వ్యక్తిగత రెండు ఖాతాల్లోనూ ఆయన అగ్రస్థానంలో నిలిచారు.

ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమం: మంత్రి కేటీఆర్ సోషల్​మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటారు. ప్రజల సమస్యలు, రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి స్పందిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు.. వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమంను నిర్వహిస్తున్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలే కేటీఆర్​ను.. ప్రపంచ వ్యాప్తంగా సోషల్​ మీడియాలో ప్రభావితం చేసే వ్యక్తుల జాబితాలో నిలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details