తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రంపై BRS యుద్ధం.. రేపు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు

BRS Protests against Central Govt : బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. రేపు కేంద్రం తెలంగాణపై అసత్య ప్రచారం చేస్తోందని.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆదేశించారు.

Ktr
Ktr

By

Published : Dec 22, 2022, 1:04 PM IST

BRS Protests against Central Govt : రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సహా రాష్ట్రంపై కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే రేపు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే పంట ఆరబోత కల్లాల నిర్మాణాలపై కేంద్రం కావాలనే రాద్దాంతం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.

రైతుల కోసం కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు నిర్మించుకున్న కల్లాలతో కలిగే ప్రయోజనాలను పట్టించుకోకుండా రాష్ట్రంపై వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.

రాష్ట్రంలో 750 కోట్ల రూపాయలతో 79 వేల వ్యవసాయ కల్లాలు నిర్మించాలని భావిస్తే.. కేంద్రం అడ్డుకుంటోందని కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు నిర్మించిన కల్లాలకు ఖర్చుచేసిన 151 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా రేపు చేపట్టే నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details