తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళోజీ పాటను ఆవిష్కరించడం నా అదృష్టం : మంత్రి కేటీఆర్ - జైనీ క్రియేషన్స్

ప్రజాకవి కాళోజీ బయోపిక్ సినిమా సాహసంతో కూడుకున్న పని అని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కాళోజీ మీద చిత్ర నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నవలా రచయిత, నంది అవార్డు గ్రహీత ప్రభాకర్ జైనీని మంత్రి కొనియాడారు. విశ్వమంతా ఖ్యాతినార్జించిన మహాకవి కాళోజీ నారాయణరావు పేరిట సినిమా పాటను ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

కాళోజీ పాటను ఆవిష్కరింపజేయడం నా అదృష్టం : మంత్రి కేటీఆర్
కాళోజీ పాటను ఆవిష్కరింపజేయడం నా అదృష్టం : మంత్రి కేటీఆర్

By

Published : Sep 9, 2020, 11:01 PM IST

ప్రజాకవి కాళోజీ బయోపిక్ సినిమా తీయడం సాహసంతో కూడుకున్న ప్రక్రియ అని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నవలా రచయిత, నంది అవార్డు గ్రహీత ప్రభాకర్ జైనీ అభినందనీయుడని ఆయన అన్నారు. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సారథ్యంలో జైనీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రజాకవి కాళోజీ బయోపిక్ సినిమాకు సంబంధించి నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

కాళోజీ తెలంగాణ చైతన్య స్ఫూర్తి..

కాళోజీ 106వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించేందుకు పాటను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాళోజీ తెలంగాణ చైతన్య స్ఫూర్తి అని, కళలకు కాణాచి అయిన వరంగల్ నుంచి జయకేతనం ఎగురవేశారని గుర్తుచేశారు. విశ్వమంతా ఖ్యాతినార్జించిన మహాకవి, తెలుగువారిలో సాహిత్య రంగంలో పద్మ విభూషణ్‌ పొందిన ఏకైక విప్లవ రచయిత కాళోజీ అని కీర్తించారు.

అపారగౌరవం..

కాళోజీ మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపారమైన గౌరవం ఉందన్నారు. అందుకే కాళోజీ నారాయణరావు పేరు మీద ఆరోగ్య వర్సిటీ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. వరంగల్‌లో కాళోజీ స్మారక సభా మందిరం నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.

'రామా చంద్రమౌళిని సత్కరించుకున్నందుకు సంతోషం'

ప్రముఖ రచయిత రామా చంద్రమౌళిని కాళోజీ సాహితీ పురస్కారంతో సత్కరించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కాళోజీ సినిమా పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ చిత్ర నిర్మాణం త్వరగా పూర్తై ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులను మంత్రి అభినందించారు.

ఆత్రేయ సంగీతం..

చిత్రానికి కెమెరామెన్​గా రవికుమార్ నీర్ల పనిచేయగా, పాటలను రచయిత కళారత్న బిక్కి కృష్ణ రాశారు. ఎస్​ఎస్ ఆత్రేయ సంగీతాన్ని సమకూర్చారు. కాళోజీ పాత్రలో మూలవిరాట్ అద్భుతంగా నటించారు. పీవీ పాత్రలో తమ్ముడు పీవీ మనోహర రావు నటించారు. సినిమాలో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు సైతం నటించి చిత్ర నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషించారు.

ఇవీ చూడండి : శాసనసభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details