తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్నూరు కాపుల సమస్యల్ని పరిష్కరిస్తాం: కేటీఆర్ - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు

సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్​లో జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి, సుపరిపాలన కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మున్నూరు కాపుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తా: కేటీఆర్
మున్నూరు కాపుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తా: కేటీఆర్

By

Published : Nov 27, 2020, 4:49 PM IST

మున్నూరు కాపుల సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించే విధంగా ప్రయత్నిస్తానని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్​లో జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి, సుపరిపాలన కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్​లో చిచ్చుపెట్టేందుకు విపక్షాలు స్పష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్తున్నాయని... ప్రజలు గందరగోళానికి గురికావొద్దని సూచించారు. తెలంగాణకు ఎంతో చేసినట్లు భాజపా నేతలు రుబాబ్ చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లలో రాష్ట్రానికి ఇచ్చింది పైసాలేకపోగా... ఇచ్చామంటూ దబాయిస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్​లో వరదలొచ్చి జనం నష్టపోతే పైసా ఇవ్వని కేంద్రం... ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు దిల్లీ నుంచి పెద్దపెద్ద నేతలు హైదరాబాద్​కు వస్తున్నారని, వచ్చేటప్పుడు కేసీఆర్ కోరిన వరదసాయం రూ. 1,300 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా?'

ABOUT THE AUTHOR

...view details