తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Help: గిరిజన విద్యార్థినికి మంత్రి కేటీఆర్ సాయం - Minister KTR assistance to tribal student

మంత్రి కేటీఆర్ గొప్పమనసు చాటుకున్నారు. ఆర్థిక స్థితి సరిగ్గాలేక చదువు మానేసే స్థితిలో ఉన్న ఓ ఎంబీబీఎస్ గిరిజన విద్యార్థినికి మంత్రి కేటీఆర్ సాయం (KTR Help) అందించారు.

KTR Help
మంత్రి కేటీఆర్

By

Published : Oct 6, 2021, 5:24 PM IST

ఫీజు చెల్లించలేక వైద్య విద్య మధ్యలో మానేసే పరిస్థితిలో ఉన్న గిరిజన విద్యార్థినికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) అండగా నిలిచారు. ఎంబీబీఎస్ (MBBS) చదివేందుకు అవసరమైన (Ktr Help to mbbs student) ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్ బోరబండకు చెందిన తిరుపతి అనూష... కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.

తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా.. తల్లి కూరగాయలు అమ్ముతున్నారు. మొదటి మూడేళ్లు 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అనూష.. కరోనా పరిస్థితుల వల్ల హైదరాబాద్ వచ్చారు. తిరిగి వెళ్లేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో.. తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించారు.

విషయం తెలుసుకున్న కేటీఆర్... అనూషకు ఆర్థిక సాయం చేసి ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని అభిలషించారు. అనూష కుటుంబ సభ్యులు కేటీఆర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థినికి మంత్రి కేటీఆర్ సాయం

ఇదీచూడండి:Telugu Academy Case: అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి

ABOUT THE AUTHOR

...view details