KTR tweet on Medical Colleges: గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్ని మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఐటీశాఖమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గత 67 ఏళ్ల కాలంలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే తెలంగాణలో ఏర్పాటయ్యాయని తెలిపారు. వైద్య విద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ గొప్ప చరిత్ర లిఖించారని మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రకారం ప్రభుత్వం మరో 13 కళాశాలలు ఏర్పాటు చేయనన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే సంగారెడ్డిలో వైద్య కళాశాల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని ప్రకటించారు. అలాగే, మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాల నిర్మాణం కూడా దాదాపు చివరిదశకు చేరుకుందని తెలిపారు.