కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా గడుపుతున్నారు. రెండు నెలలుగా లాక్డౌన్ నిబంధనల వల్ల ప్రజలెవరూ రహదారులపైకి రాలేదు. ఈ సమయాన్ని జీహెచ్ఎంసీ సద్వినియోగం చేసుకుంది.
లాక్డౌన్లో జీహెచ్ఎంసీ ఏం చేసిందంటే? - minister ktr appreciated ghmc
లాక్డౌన్ సమయాన్ని జీహెచ్ఎంసీ సద్వినియోగం చేసుకుంటోందని పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పెండింగ్లో ఉన్న రహదారి పనులు పూర్తి చేసిన జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని అభినందించారు.
శభాష్! జీహెచ్ఎంసీ
పెండింగ్లో ఉన్న రహదారి నిర్మాణ పనులు, మరమ్మతు పనులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం శ్రమించిందని అభినందించారు.