రాష్ట్రంలో జనపనార పరిశ్రమల(Ktr on jute mills) ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 10,448 మందికి.. పరోక్షంగా రెండింతల మందికి ఉపాధి లభిస్తుందని పట్టణాకభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో జూట్ మిల్లులను నెలకొల్పేలా మూడు ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థలతో అవగాహన ఒప్పందం(mou) కుదుర్చుకున్నట్లు చెప్పారు. వరంగల్లో గ్లోస్టర్ లిమిటెడ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్రో లిమిటెడ్, కామారెడ్డి జిల్లాలో ఎంబీజీ కమాడిటీస్ లిమిటెడ్ సంస్థలు.. రూ. 887 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
గోనె సంచుల తయారీకి కంపెనీలకు(Ktr on jute mills) తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. యూనిట్లు ఉత్పత్తి చేసిన గోనె సంచులను.. 20 ఏళ్ల పాటు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మూడో పంటగా జనుము పంట పండించేలా సదరు మూడు కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకునేలా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ప్రతి పంట సీజన్లో ఈ మూడు యూనిట్లు 15 కోట్ల గోనె సంచులు ఉత్పత్తి చేస్తాయని అంచనా. ఐదేళ్ల పాటు జూట్ మిల్లులకు(Ktr on jute mills) రవాణా రాయితీలు అందజేస్తాం. -కేటీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి