పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఫ్రాన్స్ వెళ్లింది. ప్యారిస్‌లో జరగనున్న సమావేశాల్లో ఈ బృందం పాల్గొంటుంది. ఈ నెల 29వ తేదీన ఫ్రెంచ్ సెనేట్లో యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రసంగించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానించింది.
ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు 29న యాంబిషన్ ఇండియాలో మంత్రి కేటీఆర్ (IT Minister KTR) కీలకోపన్యాసం చేయనున్నారు. రెండు దేశాల వ్యాపార, వాణిజ్య భాగస్వామ్యులు, కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. 'గ్రోత్ డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్‌కొవిడ్ ఎరా' అనే అంశంపై కేటీఆర్ (IT Minister KTR) తన అభిప్రాయాలు పంచుకుంటారు. పర్యటనలో భాగంగా పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో మంత్రి సమావేశమవుతారు. హెల్త్‌కేర్, క్లైమేట్‌చేంజ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కేటీఆర్ (IT Minister KTR) తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఫ్రాన్స్‌కు వెళ్లిన.. రాష్ట్ర బృందంలో ఉన్నారు.