తెలంగాణ

telangana

ETV Bharat / state

'మరోసారి ఆదరించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు' - మాజీ ఎంపీ కవిత

తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెరాసపై భరోసా ఉంచి, మరోసారి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

minister ktr and farmer mp kavitha tweets on telangana municipal election results
'మరోసారి ఆదరించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు'

By

Published : Jan 25, 2020, 4:23 PM IST

రాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్​, మాజీ ఎంపి కవిత ట్విటర్​లో స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనపై నమ్మకం ఉంచి, తెరాసను ఆదరించి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి కేటీఆర్​ ట్వీటారు.

పురపాలక ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన తెరాస అభ్యర్థులను మాజీ ఎంపీ కవిత అభినందించారు. వారి గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తెరాసను మరోసారి ఆదరించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details