మంత్రి హరీశ్ రావుకు మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు.
''పనిలో నిబద్ధతతో, క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌరవనీయులైన ఆర్థిక మంత్రి హరీశ్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు...
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటూ... ప్రజాసేవలో గడుపండి బావా. మీతో కలిసి పనిచేయడం మాకేంతో ఆనందాన్ని ఇస్తోంది.''