Minister KTR America Tour Updates Today : కేటీఆర్ అమెరికా(KTR US Tour) పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. మెడ్‌టెక్ రంగానికి చెందిన సంస్థ ఎలైవ్‌కోర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను.. సంస్థ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మెడ్‌టెక్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంస్థ సభ్యులతో చర్చించామని మంత్రి కేటిఆర్ తెలిపారు.
KTR Chicago Visit Updates :ప్రపంచ స్థాయి అగ్రి ప్రాసెసింగ్ సంస్థలలో ఒకటి అయిన.. ఆర్చర్ డానియల్స్ మిడ్‌ల్యాండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విక్రమ్ లుథార్‌తో.. కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధిపై వారికి వివరించినట్లు తెలిపారు. వ్యవసాయ వస్తువుల ఎగుమతులు, ప్రాసెసింగ్ సౌకర్యాల స్థాపన, బయో-తయారీపై అత్యాధునిక ఆర్ అండ్ డీ నిర్వహించడం వంటి వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సహకారం అందించిందని ఆయనకు వివరించినట్లు తెలిపారు.
చికాగో ఇల్లినాయిస్ స్టేట్ డిప్యూటీ గవర్నర్ క్రిస్టీ జార్జ్, చికాగో వాణిజ్య కార్యదర్శి క్రిస్టిన్ రిచర్డ్స్ తదితరులతో కేటీఆర్ సమావేశమయ్యారు. క్లీన్ టెక్, సస్టెయినబుల్ మెుబిలిటీ, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్ వంటి రంగాల్లో సహకారలపై ఇరువురు చర్చించుకున్నట్లు మంత్రి తెలిపారు. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ మాధవ్ రాజన్‌తో సమావేశమయ్యారు. ఈ మేరకు భారత్ అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే దిశగా చర్చలు జరిపినట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు.