Minister KTR America Tour Update :వివిధ అంతర్జాతీయ దిగ్గజ సంస్థల.. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ సంస్థ- జీహెచ్ఎక్స్.. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకి మందుకొచ్చింది. హైదరాబాద్‌లో ఆరోగ్య రంగానికి రంగానికి అనుకూల వాతావరణం ఉందని.. ముఖ్యంగా మానవ వనరులతో పాటు అనేక సంస్థల సమ్మిళిత ఈకో సిస్టం ఉందని తెలిపింది. జీహెచ్ఎక్స్(GHX) సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు.
Metlife Will Invest In Hyderabad :హెల్త్ కేర్ రంగం డిజిటల్ దిశగా ప్రయాణం మొదలు పెట్టిందని.. అందులో భాగంగా హెల్త్ కేర్ కంపెనీలు పెద్దఎత్తున డిజిటలీకరణ, ఐటీ ఆధారిత సేవలపై విస్తృతంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని.. జీహెచ్ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజేసింగ్ తెలిపారు. ఆ దిశలోనే హైదరాబాద్ విస్తరణ ప్రణాళికలు, గ్లోబల్ కేపబిలిటీ కేంద్రం ద్వారా లక్ష్యాలను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 నాటికి ప్రస్తుత కార్యకలాపాల్ని మూడింతలు చేసే లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలు చేపడుతుందని.. జీహెచ్ఎక్స్ తెలిపింది.
KTR On Sultanpur Medical Devices Park : 'మెడ్‌టెక్ రంగంలో మరో మైలురాయిని తెలంగాణ అధిగమించింది'
Global Health Care Exchange Organization In Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యకలాపాలు విస్తరిస్తామని.. ఇన్నోవేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆ విస్తరణ ఉంటుందని సంస్థ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో తెలిపింది. హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగానికి చేయూతను అందిస్తూనే.. ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్దఎత్తున హైదరాబాద్‌కి ఆకర్షించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్‌తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలను బలోపేతంచేసే దిశగా జీహెచ్ఎక్స్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.