తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేయండి : మంత్రి కేటీఆర్ - minister ktr alert on industries inspection

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు, తయారీ యూనిట్లలో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలని పరిశ్రమలశాఖ కార్యదర్శికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. సరైన భద్రతా ప్రమాణాలను పాటించని పరిశ్రమల పట్ల కఠిన చర్యలు చేపడతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

minister ktr alert on industries inspection
'వీలైనంత త్వరలో అన్ని పరిశ్రమలను తనిఖీ చేయండి'

By

Published : Aug 10, 2020, 4:53 PM IST

Updated : Aug 10, 2020, 10:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లో వరుస పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు, తయారీ యూనిట్లలో భద్రతా ప్రమాణాలను యుద్ధప్రాతిపదికన తనిఖీ పూర్తి చేయాలని పరిశ్రమలశాఖ కార్యదర్శికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిశీలనను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. సరైన భద్రతా ప్రమాణాలను పాటించని పరిశ్రమల పట్ల ఉదాసీనంగా ఉండేది లేదని.. కఠిన చర్యలు చేపడతామని ఈ మేరకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Last Updated : Aug 10, 2020, 10:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details