తెలంగాణ

telangana

ETV Bharat / state

'మినీ డైరీ' పథకాన్ని విజయవంతం చేయాలి : మంత్రి కొప్పుల

ఎస్సీ కార్పొరేషన్ ప్రయోగాత్మకంగా చేపడుతున్న 'మినీ డైరీ' పథకాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల.. అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Minister Koppula says 'mini diary' scheme should be successful
'మినీ డైరీ' పథకాన్ని విజయవంతం చేయాలి : మంత్రి కొప్పుల

By

Published : Jan 13, 2021, 9:13 AM IST

స్వయం ఉపాధి కల్పించడం ద్వారా ఎస్సీ కార్పొరేషన్ దళితుల జీవన ప్రమాణాలను మరింత పెంపొందించేందుకు పాటు పడుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. హైదరాబాద్​లోని క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎస్సీ కార్పొరేషన్ ప్రయోగాత్మకంగా చేపడుతున్న 'మినీ డైరీ' పథకాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. పథకం కింద లబ్ధిదారులకు 4గేదెలను అందజేసి.. స్వయం సమృద్ధి సాధించేందుకు, వారికి సాయమందించాలని అధికారులకు సూచించారు.

సొసైటీ ఏర్పాటు, లబ్ధిదారుల ఎంపికను మరింత వేగవంతం చేయాలని మంత్రి కోరారు. బ్యాంకులు, పాడి పరిశ్రమల యాజమాన్యాలతో ఒప్పందాల పూర్తికి.. శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు.

ఈ కాన్ఫరెన్స్​లో ఎస్సీ కార్పొరేషన్ ఎం.డి, జీ.ఎం లతో పాటు 10జిల్లాలకు చెందిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈడీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'దళితులకు హామీలేనా.. అమలు చేయరా?'

ABOUT THE AUTHOR

...view details