మత సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి మన రాష్ట్రం పెట్టింది పేరని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలు, కులాలకు సమానమైన సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు
తెరాస పాలనలో మైనారిటీలతో పాటు ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తున్నారని కొప్పుల తెలిపారు. మైనారిటీల అభ్యున్నతి కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1606 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తుండటంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయన్నారు.