తెలంగాణ

telangana

ETV Bharat / state

'అన్ని వర్గాల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తోంది' - తెలంగాణ అసెంబ్లీ వార్తలు

వక్ఫ్ భూముల పరిరక్షణకై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అన్ని వర్గాల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం బాధ్యతతో పని చేస్తుందన్నారు. అన్యక్రాంత భూములపై ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడించారు.

minister-koppula-eswar-on-wafq-lands-in-telangana-assembly-session-2020
'అన్ని వర్గాల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తోంది'

By

Published : Sep 9, 2020, 12:52 PM IST

వక్ఫ్ భూముల పరిరక్షణకై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులు ఇచ్చారు. వక్ఫ్ భూముకు సంబంధించి సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్​ను ప్రారంభించిన తర్వాత... వక్ఫ్ యాక్ట్ ప్రకారం సర్వే మొదలు పెట్టారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో కొన్ని వేలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు.

'అన్ని వర్గాల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తోంది'

వక్ఫ్ భూములపై పలు దఫాలుగా సర్వే కమిషన్ సర్వే జరిపిందని తెలిపారు. అన్ని వర్గాల ఆస్తుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతతో పని చేస్తుందన్నారు. జ్యూడిషియల్ పవర్ కూడా వక్ఫ్​కు ఇవ్వాలని కోరడంపై స్పందించి... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం... అన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంత భూములపై ప్రభుత్వం చాలా చిత్త శుద్ధిగా పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి:ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details