తెలంగాణ

telangana

ETV Bharat / state

మన గురుకులాలు దేశానికే ఆదర్శం: కొప్పుల - గురుకులాలపై మంత్రి కొప్పుల సమాధానం

రాష్ట్రంలో మైనార్టీలకు మెరుగైన విద్యనందిస్తున్నామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. శాసనసభలో సభ్యులడిగిన ప్రశ్నకు సమాధానంగా మైనార్టీ విద్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.

మన గురుకులాలు దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల
మన గురుకులాలు దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల

By

Published : Mar 23, 2021, 4:33 PM IST

మైనార్టీలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. శాసనసభలో సభ్యులడిగిన ప్రశ్నకు సమాధానంగా మైనార్టీ విద్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకులాలున్నాయని... కార్పోరేట్​ విద్యాసంస్థలకు ధీటుగా తెలంగాణలో గురుకులాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

2018-19లో 12 పాఠశాలలను జూనియర్ కళాశాలుగా అప్‌గ్రేడ్‌ చేయగా... 2020-21లో 71 టీఎంఆర్ పాఠశాలను జూనియర్ కళాశాలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు స్పష్టం చేశారు. 2016-17లో 71, 2017-18సంవత్సరంలో 133 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో బాలురకు 107, బాలికలకు 97 పాఠశాలల్ని ప్రత్యేకించడం జరిగిందని తెలిపారు. ఈ పాఠశాలల్లో 30,560 మంది విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో 7,570 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి వివరించారు.

ఇదీ చూడండి:'అప్పులతో కాదు.. సంపదను పెంచుతూ అభివృద్ధి చేయండి'

ABOUT THE AUTHOR

...view details